ధ్రువీకరణ పత్రాల పేరుతో మోసాలు

by Shyam |
sarpanch
X

దిశ, మేడ్చల్: గ్రామ స్వరాజ్యం దిశగా కేసీఆర్ ముందడుగు వేస్తున్న నేపథ్యంలో సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడుతూ.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సంఘటన మేడ్చల్ మండల పరిధిలోని ఎల్లంపేట్ గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సర్పంచ్ వెన్నెల రామకృష్ణ ఆగడాలు మితిమీరుతున్నాయి. గ్రామాల్లో కార్యదర్శి, ఇంజనీర్ విభాగం, బిల్ కలెక్టర్లు చెయ్యాల్సిన పనులను సైతం తానే ఏకఛత్రాధిపత్యంగా అనధికారికంగా ఇళ్ల ధ్రువీకరణ పత్రాలు జారీ పేరిట ప్రజల నుంచి డబ్బులు దండుకోవడం జరుగుతుందని సమాచారం.

sarpanch

అనధికారికంగా ఇలా పర్మిషన్‌ల పేరిట ధ్రువీకరణ పత్రాల జారీ చేస్తూ అధికారులను సైతం ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి నిర్వహించవలసిన నిధులను సైతం తానే చక్కబెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామకంఠంలోని భూములను సైతం అక్రమంగా ధ్రువీకరణ పత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నటు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాను చెప్పినట్లు వినకపోతే తన అనుచరులతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించడంలో స్వయాన సర్పంచ్ కీలక పాత్ర వహిస్తున్నారని వెల్లడవుతుంది. అనధికారిక ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ అధికారులను సైతం ముప్పుతిప్పలు పెడుతున్న సర్పంచ్ ఆగడాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed