- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరపైకి ‘సరోజ్ జీ’ బయోపిక్
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి.. ఇండియన్ సినిమాకు తీరని లోటని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువుగా ఆమె నేర్పిన పాఠాలు తమ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. డ్యాన్స్ ఉన్నంత వరకు తను బ్రతికే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు.
కాగా, ‘సరోజ్ జీ’ జీవితకథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది తన కుమార్తె సుకైనా నాగ్‌పాల్. సరోజ్ జీ బయోపిక్ తీయాలని చాలా మంది తనను సంప్రదించారని తెలిపిన ఆమె.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా తొలుత ఈ ప్రపోజల్‌ను తన ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపింది. అమ్మను ఇంతకు ముందు ఈ విషయం గురించి అడిగినప్పుడు కూడా తన బయోపిక్ రెమో డిసౌజా తెరకెక్కిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్లు వెల్లడించింది. చాలా కష్టపడి.. సాధారణ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన రెమో డిసౌజా పట్ల అమ్మకు అభిమానం ఎక్కువగా ఉండేదని తెలిపింది సరోజ్ జీ తనయ.