‘సర్కారువారి పాట’ మూవీ అప్‌డేట్.. దీపావళికి ఫస్ట్ సింగిల్

by Shyam |
‘సర్కారువారి పాట’ మూవీ అప్‌డేట్.. దీపావళికి ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా : పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో భారీ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న సినిమా ఫస్ట్ సింగిల్ పై ప్రస్తుతం బజ్ క్రియేట్ అయింది. అలాగే విడుదలకు సంబంధించిన అప్‌డేట్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా విడుదల కానుందని సమాచారం. కాగా వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్‌లో ‘సర్కారు వారి పాట’ కూడా ఒకటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకొన్న మిగతా సినిమాల సింగిల్స్ ఎప్పుడో విడుదల చేయగా, ‘సర్కారు వారి పాట, రాధేశ్యామ్’ మూవీస్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఇక ప్రిన్స్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించగా.. తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story