- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'సరిలేరు నీకెవ్వరు' ప్రీమియర్ షో… 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా నాకు నేనే సాటి… నాకు నేనే పోటీ అనే విధంగా ఓపెనింగ్స్, షేర్స్ సాధించి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించుకుంది. సంక్రాంతికి అసలైన ఎంటర్టైన్మెంట్ అందించి ప్రేక్షకులచే టేక్ ఏ బో చెప్పించుకుంది. అంతటితో ఆగకుండా…. బుల్లితెర మీద కూడా తన హవా చూపించింది ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటిన ‘బాహుబలి’ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ… అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ అందుకుని టాప్ ప్లేస్ కొట్టేసింది.
బాక్సాఫీసు వద్ద టాలీవుడ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం… స్మాల్ స్క్రీన్ పై కూడా అంతే వేగంగా రికార్డు బద్ధలు కొట్టింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక రేటింగ్ అందుకుంది. ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ చిత్రం 22.7 పాయింట్లతో అత్యధిక టీఆర్పీ అందుకున్న చిత్రంగా ఉండగా… ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీమియర్ షోతో ఆ రికార్డు కాస్త సెకండ్ ప్లేస్‌కు వెళ్లిపోయింది. 23.4 పాయింట్లు సాధించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఫస్ట్ ప్లేస్ కొట్టేసి ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతుండగా… లాక్ డౌన్ కారణంగానే అంత టీఆర్పీ వచ్చిందంటున్నారు మరికొందరు.
టాప్ 5 చిత్రాలు:
సరిలేరు నీకెవ్వరు (23.4)
బాహుబలి 2 (22.7)
శ్రీమంతుడు(22.54)
డీజే(21.7)
బాహుబలి(21.54)
Tags : Sarileru Neekevvaru, Bahubali, Records, Big Screen, Small Screen