- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్దార్ ముందుస్తు సంబురాలు.. ఆయన గెలుపు ఫిక్స్ అయిందా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే స్వతంత్ర అభ్యర్థి ముందస్తుగానే సంబురాలు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత రవీందర్ సింగ్ అభిమానులు బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సంబురాల్లో ఆయన కూడా పాల్గొనడం విశేషం. రవీందర్ సింగ్ నాయత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు. అయితే పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే రవీందర్ సింగ్ ఆనందోత్సవాలు నిర్వహించడమే హాట్ టాపిక్‌గా మారింది.
ఓ వైపున అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంపుల నుండి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించింది. 12 రోజుల పాటు నిర్విరామంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి బ్రీఫింగ్ ఇచ్చారు. చివరకు మాక్ పోలింగ్ నిర్వహించి కూడా వారికి శిక్షణ ఇచ్చారు. మరో వైపున జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా తమ పార్టీకి చెందిన వారే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ఉన్న 986 ఓట్లలో ఒక్కటి కూడా తక్కువగా పడవని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా సవాల్ విసిరారు. ఓ రకంగా చెప్పాలంటే రవీందర్ సింగ్ గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు కూడా. ఈ నేఫథ్యంలో రవీందర్ సింగ్ శిబిరంలో గెలుస్తామన్న సంకేతాలు ఇస్తూ సంబురాలు చేసుకోవడమే చర్చనీయాంశం అయింది.
క్రాస్ ఓటింగ్ పై ధీమానా..?
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ వేస్తారన్న ధీమా కూడా సర్దార్ రవీందర్ సింగ్ శిబిరంలో వ్యక్తం అవుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ క్రాస్ ఓటింగ్‌ను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన విక్టరీకి తగ్గట్టుగా ఓట్లు పడితీరుతాయన్న కాన్ఫిడెంట్ వ్యక్తం అవుతుండడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓటర్లే మెజార్టీకి మించి ఉండడంతో పాటు క్యాంపుల్లో ఉన్న వారంతా రవీందర్ సింగ్‌తో టచ్‌లో వచ్చే అవకాశాలు లేవన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన శిబిరం సంబురాలు చేసుకోవడం మాత్రం సరికొత్త చర్చకు దారి తీసింది. అయితే పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరించినప్పుడు ఆయన గెలుపునకు అవసరమైన ఓట్లు వేశామన్న భరోసా కల్పించడం వల్లే నమ్మకం కల్గిందని తెలుస్తోంది.