- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్క్రీన్ టైమ్ మ్యాటరే కాదు : సారా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘కూలీ నం.1’ డిసెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. వరుణ్ ధావన్‌తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్న భామ.. తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై చర్చించింది. స్క్రీన్ టైమ్ కన్నా కూడా మంచి స్టోరీలో భాగస్వామ్యం కావడానికే ఇంపార్టెన్స్ ఇస్తానని తెలిపింది. కో స్టార్స్‌తో కంపేర్ చేసుకునేందుకు, వారితో పోటీ పడేందుకు ఇండస్ట్రీకి రాలేదన్న సారా.. ‘సింబ, కూలీ నం. 1’ లాంటి కామెడి జోనర్ మూవీస్‌లో రణ్‌వీర్, వరుణ్ లాంటి స్టార్స్‌తో కలిసి నటించినప్పుడు కంపేర్ చేసుకునే పొజిషన్‌లో లేననే అనిపిస్తుందని వెల్లడించింది. అలాంటి టాలెంటెడ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టార్స్‌తో నటించినప్పుడు మనకు స్క్రీన్ స్పేస్ ఎంత టైమ్ ఇచ్చారనేది అసలు మ్యాటరే కాదన్న సారా.. వారు చాలా నేర్పిస్తారని, ఇన్‌స్పైర్ చేస్తారని చెప్పింది.
1995లో గోవింద, కరిష్మా కపూర్ జంటగా నటించిన ‘కూలీ నం.1’ ప్రస్తుతం నటించిన సారా.. తాను కరిష్మా నుంచి స్ఫూర్తి పొందానని తెలిపింది. తనొక ఐకానిక్ స్టార్ అని, తన కన్నా బెటర్‌గా నటించాలని ఆశించడం మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయని, అమెజాన్ ప్రైమ్‌లో సినిమా చూడటం సేఫెస్ట్ వే అని అభిప్రాయపడింది. నానమ్మలు, చిన్నపిల్లలు సినిమా చూడటం మిస్ అవడం తనకు ఇష్టం లేదన్న సారా.. క్రిస్మస్ రోజున ఇంట్లో కూర్చుని సినిమా చూస్తూ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకోవడం కన్నా గొప్ప అనుభూతి ఏముంటుందని అంటోంది.