- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల నిజమైంది : సారా
దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటించిన చిత్రం ‘కూలీ నం.1’. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1995లో గోవింద, కరిష్మా కపూర్ జంటగా నటించిన కూలీ నం.1కు రీమేక్ కాగా.. ఈ మూవీ రీమేక్‌లో నటించడం పట్ల తన కల నిజమైనట్లుగా ఉందని సారా తెలిపింది. హుస్న్ హై సుహానా, మిర్చి లగీతో మై క్యా కరూ లాంటి పాటలు వింటూ పెరిగిన తాను.. మళ్లీ అదే సినిమాలో నటించడం, ఆ పాటలకు స్టెప్స్ వేయడం నమ్మలేకపోతున్నానని తెలిపింది. లేటెస్ట్‌గా కూలీ నం.1 ట్రైలర్ రిలీజ్ కాగా, ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో సాగుతూ పైసా వసూల్ మూవీ అయ్యేలా ఉంది. వరుణ్, సారా జంట చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వగా.. సినిమా అమెజాన్ ప్రైమ్‌లో క్రిస్మస్ కానుకగా డిసంబర్ 25న విడుదల కానుంది.
మరో వైపు సారా న్యూ ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. ఆదిత్య ధర్, విక్కీ కౌశల్ కాంబినేషన్‌లో వస్తున్న సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’కు ఓకే చెప్పింది. ఫస్ట్ టైమ్ సారా విక్కీతో కలిసి నటించబోతుండగా.. అక్టోబర్ 2021 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది సినిమా. ఇండియా, న్యూజిలాండ్, జపాన్, నమీబియాలో షూటింగ్ జరగనుండగా.. 80-90 రోజుల పాటు చిత్రీకరణ సాగుతుందని సమాచారం. మైథలాజికల్ రోల్‌లో కనిపించబోతున్న సారా ఇప్పటికే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసిందని టాక్.