- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంతోష్ బాబు అంత్యక్రియలు కాస్త ఆలస్యం
దిశ, నల్లగొండ: కల్నల్ సంతోష్ బాబు మరణంతో సూర్యాపేట దుఖ సాగరంలో మునిగిపోయింది. జిల్లా అంతటా విషణ్ణ వదనాలతో మూగబోయింది. సోమవారం రాత్రి చైనా-భారత్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో సూర్యాపేట వాసి సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే. అయితే కల్నల్ సంతోష్ మృతి అంత్యక్రియలు వాస్తవానికి సాయంత్ర 6 గంటల్లోపు పూర్తి కావాల్సి ఉంది. కానీ, మృతదేహం రావడంలో ఆలస్యమైంది. మధ్యాహ్నాం 3.30 గంటలకు హైదరాబాద్ హకీంపేటకు చేరుకోవాల్సిన సంతోష్ బాబు మృతదేహం ఆలస్యంగా చేరుకుంది. దీంతో అక్కడి నుంచి రాత్రి 8 గంటల వరకు సూర్యాపేటకు చేరుకోనుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే క్యాసారం గ్రామంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలోనే అధికారులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్మీ, ప్రభుత్వ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.