- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాగర్‌లో ‘సంకినేని’ స్కెచ్.. సీన్‌లోకి ‘చిన్నపరెడ్డి’?
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో దూకుడు చూపించిన బీజేపీ.. సాగర్‌లోనూ అదే ప్రభంజనం కొనసాగిస్తుందా ? టీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ముందే సీన్‌లోకి ఎంటరైన కాషాయ శ్రేణులు హ్యాట్రిక్ విక్టరీ కొడుతారా? ఉమ్మడి జిల్లా నేతకే గెలుపు బాధ్యతలు అప్పగించిన హైకమాండ్.. ఆ దిశగా గ్రౌండ్‌వర్క్ పూర్తి చేసిందా? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్ర, జిల్లా బీజేపీ శ్రేణులు. కొద్దిరోజుల నుంచి సాగర్ నియోజకవర్గంపై స్పెషల్ లుక్కేసిన అగ్రనేతలు ఇటీవల హైదరాబాద్‌లో టీఆర్ఎస్ కీలక నేతలకు టచ్‌లోకి రావడం అందులో భాగమేనంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ లీడర్ సంకినేని వెంకటేశ్వరరావు వేసిన స్కెచ్ సాగర్ ఉపఎన్నికను మరింత హీటెక్కిస్తుంది.
రెండునెలల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూయడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. నోముల చనిపోయిన వారంరోజులకే కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగినా అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆ వార్తలను జానారెడ్డి ఖండించారు. మరోవైపు సాగర్ ఎలక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ..సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వరావుతో పాటు మరో ఇద్దరికి ఉపఎన్నిక గెలుపు బాధ్యతను అప్పగించింది. ఆరోజు నుంచి తనకు ఉన్న పాత పరిచయాలతో సాగర్‌లో సంకేనేని చక్రం తిప్పుతూ వస్తున్నారు. వచ్చే నెలరోజుల్లో ఉపఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ.. హైదరాబాద్ నాగోల్‌లో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతను కలిసి ఆపార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
గతంలో తేరా చిన్నపరెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావులు టీడీపీలో కలిసి పనిచేశారు. ఆ పరిచయంతోనే క్యాడర్, ఆర్థికంగా బలమున్న చిన్నపరెడ్డిని కాషాయం పార్టీ వైపునకు తీసుకువచ్చేందుకు జిల్లా బీజేపీ నేతలు రాయబారాలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నేత జానారెడ్డి సాగర్ నియోజకవర్గంలో పోటీకి దిగిన సందర్భాలున్నాయి. మరోవైపు జానారెడ్డి కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని జిల్లాల్లో టాక్ నడుస్తుండటంతో చిన్నపరెడ్డిని బీజేపీలోకి తీసుకువస్తే.. అటు జానారెడ్డికి, ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటు.. బండి సంజయ్, కిషన్‌రెడ్డితో సంకినేనికి సత్సబంధాలు ఉండటంతోనే చిన్నపరెడ్డిని బీజేపీలోకి తీసుకువచ్చే బాధ్యతలు అప్పగించారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి.
మంత్రి జగదీశ్‌రెడ్డికి ‘చెక్’ పెట్టేందుకేనా ?
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడినల్గొండ జిల్లా నుంచి మంత్రిగా కొనసాగుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. గతంలో టీడీపీలో ఉన్న తేరా చిన్నపరెడ్డిని గులాబీ పార్టీలోకి తీసుకువచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నపరెడ్డి సాగర్ సీటును ఆశించినా కేసీఆర్ ఎలాంటి ప్రయోగం చేయకుండా 2014లో అక్కడి నుంచి పోటీచేసిన నోములకే మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఆల్‌రెడీ మండలిలో కొనసాగుతున్నందున చిన్నపరెడ్డి సైతం అంతగా ఏం ఫీల్ కాలేదు. మరోవైపు జిల్లాలో చక్రం తిప్పే జగదీశ్‌రెడ్డికే రెండోసారి సైతం మంత్రి పదవి దక్కడంతో నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలోనే సాగర్ నుంచి మళ్లీ ఇప్పుడు నోముల ఫ్యామిలీకే టికెట్ ఇస్తారన్న ఊహాగానాలతో.. ఆ విషయాన్ని చిన్నపరెడ్డి దగ్గర ప్రస్తావించిన బీజేపీ ఆయన్ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో వాడి వేడిగా జరుగుతోంది.
ఒకవేళ చిన్నపరెడ్డి పార్టీ వీడితే.. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్లు చీలడమే గాక, సంకినేని, చిన్నపరెడ్డి నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డికి గట్టి పోటీ రావడం పక్కా. సూర్యాపేట నియోజవకర్గంలో జగదీశ్‌రెడ్డిపై రెండుసార్లు వరుసగా ఓటమిపాలైన సంకినేని.. మరో విధంగా జగదీశ్‌రెడ్డిపై పైచేయి సాధించేందుకు చిన్నపరెడ్డి రూపంలో ఆయనకు చెక్‌పెట్టే వ్యూహాలు రచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.