సింగిల్ తీయకపోవడంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సంగర్కర

by Shiva |   ( Updated:2021-04-13 11:51:13.0  )
సింగిల్ తీయకపోవడంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సంగర్కర
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆఖరి రెండు బంతుల్లో 5 పరుగుల కావల్సిన సమయంలో సంజూ శాంసన్ సింగ్ తీయకుండా సగం పిచ్ దాటి వచ్చిన మోరిస్‌ను వెనక్కు పంపించాడు. ఆ తర్వాత బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద ఫీల్డర్‌కు దొరికిపోయి సంజూ అవుటయ్యాడు. సంజూ సింగిల్ తీయకపోవడంపై పలు విమర్శలు వెల్లవెత్తాయి. అతడిది అతి విశ్వాసమని.. సింగిల్ తీసి మోరిస్‌కి బ్యాటింగ్ ఇచ్చుంటే కొత్త బ్యాట్స్‌మాన్‌కు బౌలర్ భయపడే వాడనే విమర్శలు వచ్చాయి. కాగా, సంజూ సింగిల్ తీయకపోవడంపై రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కుమార సంగక్కర సమర్దించారు. ‘సంజూపై అతడికే కాదు మాకందరికీ నమ్మకం ఉన్నది. అతడు సింగిల్ తీయకపోవడమే మంచిదని మేం భావించాం. చివరి బంతికి దాదాపు సిక్స్ కొట్టినంత పని చేశాడు. మరో సారి అలాంటి పరిస్థితుల్లో మరో 10 అడుగులు అవతలకు బంతిని కొడతాడు’ అని సంగక్కర అన్నాడు. అలవాటైన బౌలర్‌ను ఆత్మవిశ్వాసంతో ఆడగలననే ఆ నిర్ణయం తీసుకున్నాడని క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed