- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరొక్క ఛాన్స్ ప్లీజ్: బీసీసీఐకి మంజ్రేకర్ లేఖ
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తనకు ఐపీఎల్‌లో కామెంట్రీ ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తూ ఈ-మెయిల్ సందేశాన్ని పంపారు. ఈ ఏడాది యూఏఈలో నిర్వహించనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన కామెంట్రీ ప్యానల్‌లో చోటు కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఇకపై బీసీసీఐ నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని, తనకు మరొక్క అవకాశం ఇవ్వాలని మంజ్రేకర్ విజ్ఞప్తి చేశారు. కాగా, క్రికెట్ వ్యాఖ్యాతగా ఎంతో పేరు తెచ్చుకున్న మంజ్రేకర్ గతేడాది వన్డే ప్రపంచ కప్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీం ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజాను ఉద్దేశించి ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అంటూ హేళన చేశాడు. ఐపీఎల్ సందర్భంగా ముంబై జట్టు సభ్యుడు కీరన్ పొలార్డ్‌ను ఒక మతిలేని క్రికెటర్ అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా తన సహచర కామెంటేటర్ హర్ష భోగ్లే పట్ల కూడా అవమానకరంగా మాట్లాడాడు. ఇవన్నీ గమనించిన బీసీసీఐ ఈ ఏడాది మార్చిలో కామెంటేటర్ ప్యానల్ నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికా సిరీస్ సందర్భంగా అతడిని వ్యాఖ్యాతగా ఎంపిక చేయలేదు. తనను తొలగించడంపై, తన వ్యాఖ్యలపై మంజ్రేకర్ గతంలోనే వివరణ ఇచ్చాడు. అయినా బీసీసీఐ పట్టించుకోలేదు. త్వరలోనే ఐపీఎల్ 2020 కామెంట్రీ ప్యానల్‌ను బీసీసీఐ ప్రకటించబోతున్నది. ఈ నేపథ్యంలోనే మంజ్రేకర్ లేఖ రాశాడు.