- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శానిటైజర్లతో కళ్లకు ముప్పు?
మాస్కులు, శానిటైజర్లు ఇప్పుడు జీవితంలో భాగమైపోయాయి. కరోనా భయానికి శానిటైజర్లను అతిగా వాడుతున్నారు. శానిటైజర్ల బిజినెస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కల్తీ కూడా మొదలైంది. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి పెద్ద మొత్తాల్లో శానిటైజర్ కల్తీ దందాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఈ కల్తీ శానిటైజర్ల వల్ల మొన్నటి వరకు చర్మ సమస్యలే వస్తున్నాయని, కొద్ది రోజులు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అనుకున్నారు. అది నిజమే.. కానీ ఇప్పుడు వీటి వల్ల ఒక కొత్త ఆరోగ్య సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ శానిటైజర్ల కారణంగా కళ్లకు ముప్పు వాటిల్లుతుందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వారు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా ఈ శానిటైజర్లను ఎఫ్‌డీఏ ఆమోదితం అని లేబుల్ పెట్టి కూడా అమ్ముతున్నారని వెల్లడించారు. ఇలాంటి శానిటైజర్లలో విషపూరిత ఆల్కహాల్ కలిపి తయారుచేయడం వల్ల ఇవి కంటికి తగలగానే మంట మండి, ఎర్రగా మారి, మసకగా కనిపించడం మొదలవుతుందని.. ఆ లక్షణాలను కూడా ఎఫ్‌డీఏ వారు వివరించారు. అందుకే శానిటైజర్లు కొనే ముందు జాగ్రత్తగా ఉండాలని వారు సలహా ఇస్తున్నారు. పేరుకు ఇథనాల్ ఉన్నట్లు చెబుతున్నా లోపల మాత్రం మిథనాల్ కలుపుతున్నారు. అందుకే అలాంటి నిషేధిత శానిటైజర్ల జాబితాను ఎఫ్‌డీఏ ఇప్పటికే విడుదల చేసింది. ఆ జాబితాను అనుసరిస్తూ శానిటైజర్లు చూసుకుని కొనాలని చెబుతున్నారు. అలాగే శానిటైజర్‌ను తక్కువ మొత్తంలో వాడాలని, ఏదైనా ముట్టుకున్న తర్వాతనే ఉపయోగించాలని, తరచుగా అనవసరంగా వాడితే చర్మసమస్యలు వస్తాయని కూడా చెప్పారు.