సైనా నెహ్వాల్‌కు ఛాలెంజ్ విసిరిన సానియా మీర్జా

by Shyam |
సైనా నెహ్వాల్‌కు ఛాలెంజ్ విసిరిన సానియా మీర్జా
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టెన్నీస్ స్టార్ సానియా మీర్జా సోమవారం ఫిలింనగర్‌లో మొక్కలు నాటారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఛాలెంజ్‌ను స్వీకరించి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, దీనివల్ల మనం ప్రకృతిని రక్షించుకోవచ్చన్నారు. ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్, పరిశ్రమల శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

Advertisement

Next Story