- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదవీ బాధ్యతలు చేపట్టిన సంగారెడ్డి
దిశ, మెదక్: చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్, డైరెక్టర్లు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డైరెక్టర్లు జైపాల్ నాయక్, బి. ప్రభాకర్ రెడ్డిలు గణపతి పూజను జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు . అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ … స్వతహాగా తాను చెరుకు రైతునని, చెరుకు రైతుల కష్టాలు తనకు బాగా తెలుసని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ గా నియమించిన కేటిఆర్, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు నియంత్రణ అధికారి రమణి, జహీరాబాద్ చెరుకు నియంత్రణ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కంది ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, కాసాల రాంరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, చేర్యాల ప్రభాకర్, కౌన్సిలర్లు మంజులత నాగరాజు, మున్నూరు విష్ణువర్ధన్, నాయకులు బొంగుల రవితో పాటు పలువురు పాల్గొన్నారు.