రాష్ట్రం కలిసుండాలని కోరుకున్నా : జగ్గారెడ్డి

by srinivas |
రాష్ట్రం కలిసుండాలని కోరుకున్నా : జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి విజయవాడ ఆఫీస్‌కు వచ్చానని వెల్లడించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని తాను మొదటినుంచి కోరుకున్నానని తెలిపారు. ఏపీలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకే వస్తేనే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story