- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంగారెడ్డి చేపలు జూపార్కుకు

X
దిశ, మెదక్: లాక్డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతోంది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా సంగారెడ్డి జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువులోని చేపలను జూపార్కుకు తరలిస్తున్నారు . ప్రస్తుతం హైదరాబాద్లో చేపల మార్కెట్లతో పాటు ఇతర దుకాణాలు మూసి వేశారు . దీంతో జూ పార్కులో జంతువులు , పక్షుల పోషణకు ఇబ్బందిగా మారింది. అయితే, సంగారెడ్డి జిల్లా నుంచి చేపలను పంపాలని జూ పార్కు అధికారులు కోరారు. ఇందుకు జిల్లా మత్స్య శాఖ అధికారిణి సుజాత అంగీకరం తెలిపారు. ఈ నేపథ్యంలో మహబూబ్ సాగర్ చెరువు నుంచి మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేపలు పట్టి జూపార్కుకు తరలించారు.
Tags: mahabubsagar, fish, zoo park, Sangareddy
Next Story