పోలీసులపై సంగారెడ్డి కలెక్టర్ ఆగ్రహం

by Shyam |
పోలీసులపై సంగారెడ్డి కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, మెదక్: సంగారెడ్డిలో లాక్ డౌన్‌ అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఓ బ్యాంకు వద్ద సోమవారం ఉదయం ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీనిపై పలువురి నుంచి విమర్శలు రావడంతో స్పందించిన కలెక్టర్.. బ్యాంకు అధికారులు, పోలీసులపై మండిపడ్డారు. ప్రజలు విడతల వారీగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఖాతాదారులు సామాజిక బాధ్యత పాటించేలా చూడాలని చెప్పారు. అలాగే, రోడ్లపై విచ్చిలవిడిగా వాహనాలు తిరుగుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

tags: sangareddy, collector hanumantha rao, lockdown, bank, corona, virus,


Advertisement
Next Story

Most Viewed