- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉగ్రరూపం దాల్చిన ‘కృష్ణమ్మ’.. నీట మునిగిన సంగమేశ్వరుడు
దిశ, ఏపీ బ్యూరో : కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం గంగమ్మ ఒడిలోకి చేరింది. సప్తనదుల సంగమ ప్రదేశంలో వెలిసిన సంగమేశ్వరుడి ఆలయం నీటమునిగింది. కృష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో కేవలం గోపురం మాత్రమే దర్శనమిస్తోంది. ఈనెల 20న గర్భగుడిలోకి రెండు అడుగుల మేర నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో గుడి మునిగిపోయింది. కేవలం గోపురం మాత్రమే భక్తులకు దర్శనమిస్తోంది.
దీంతో పూజారులు కృష్ణమ్మకు హారతి ఇచ్చి.. సంగమేశ్వరుడికి అంత్య పూజలు నిర్వహించి సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. ప్రతి ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరినప్పుడు ఈ ఆలయం ముంపునకు గురవుతుంది. సంగమేశ్వరాలయం ఈ ఏడాది మార్చి 21న కృష్ణా జలాల నుంచి బయటపడగా ఇప్పుడు నీటమునిగింది. ఇప్పటి వరకు 122 రోజులు పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. సంగమేశ్వర స్వామి దర్శనం కావాలంటే భక్తులు మరో 8 నెలలు వేచి చూడాల్సిందే.