బాలీవుడ్‌ను నమ్ముకున్న సందీప్ రెడ్డి?

by Shyam |
బాలీవుడ్‌ను నమ్ముకున్న సందీప్ రెడ్డి?
X

దర్శకుడు సందీప్ వంగా.. తొలి సినిమా అర్జున్ రెడ్డితో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. విజయ్ దేవరకొండకు స్టార్ రేంజ్ కట్టబెట్టిన ఈ సినిమాను హిందీలో కూడా తనే రీమేక్ చేసిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా కబీర్ సింగ్‌గా తెరకెక్కిన చిత్రం.. అక్కడ కూడా భారీ కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమా విడుదలై ఆల్రెడీ ఏడాది కంప్లీట్ అయినా, సందీప్ నుంచి మరో సినిమా లేదు.

ఆ మధ్య క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించే పనిలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను కలవగా ‘నో’ చెప్పాడట. తర్వాత ఆ ప్రాజెక్ట్ ప్రభాస్ దగ్గరికి వెళ్లిందట. కానీ తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అక్కడే ఆగిపోయింది. అయితే ఈ మధ్యే రణ్‌బీర్ కపూర్‌ను మళ్లీ కలిశాడట సందీప్. ఈసారి పకడ్బందీ స్క్రిప్ట్‌తో వెళ్ళిన తనకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని సమాచారం. ఇదే కనుక నిజమైతే సందీప్, రణ్‌బీర్ కాంబినేషన్ పక్కాగా అదిరిపోతుందని.. సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story