ఈసారి రొమాంటిక్ యాంగిల్‌లో జార్జి రెడ్డి

by Anukaran |   ( Updated:2020-11-26 08:37:57.0  )
ఈసారి రొమాంటిక్ యాంగిల్‌లో జార్జి రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : జార్జి రెడ్డి ఫేమ్ సందీప్ మాధవన్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో రాబోతున్నారు. రచయిత జేవీ మధు కిరణ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. హల్కియోన్ మూవీస్ బ్యానర్‌పై అరుణ్ కుమార్ సూరపనేని సినిమాను నిర్మించబోతున్నారు. ఈ బ్యానర్‌లో వచ్చే ఫస్ట్ సినిమా ఇదే కాగా.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనుంది మూవీ యూనిట్.

https://twitter.com/baraju_SuperHit/status/1331878406015700995?s=19

‘వంగవీటి, జార్జి రెడ్డి’ లాంటి యాక్షన్ సినిమాలతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్.. ఫస్ట్ టైమ్ రొమాంటిక్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయం అభిమానుల్లో ఆసక్తిని పెంచగా.. సినిమా తప్పకుండా స్పెషల్‌గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాగే డిఫరెంట్ జోనర్స్‌లో మూవీస్ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story