కాకతీయుల టెక్నాలజీ.. అయోధ్యకు ప్రతిపాదనలు

by  |
కాకతీయుల టెక్నాలజీ.. అయోధ్యకు ప్రతిపాదనలు
X

దిశ, వెబ్ డెస్క్: అద్భుత కట్టడాలు వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం కాకతీయుల కళా వైభవానికి ప్రతీకలు. కొన్ని వేల ఏళ్ల కిత్రం నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇసుకనే పునాదిగా వేసి నిర్మించారు కాకతీయుల రాజులు. ఈ టెక్నాలజీని ప్రస్తుతం సాండ్ బాక్స్ టెక్నాలజీగా అభివరిస్తున్నారు నిపుణులు. అసలు సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే..

ఆలయాన్ని ఎలాంటి ఆకారంలో నిర్మిస్తారో..అంతటి పరిమాణంలో గుంతను తవ్వి నది నుంచి తెచ్చిన స్వచ్ఛమైన ఇసుకును గుంతలో నింపుతారు. దీన్ని పునాదిగా భావిస్తారు. దీనిపై మండపం, స్తంబాలు నిలబెట్టి ఆలయాన్ని నిర్మిస్తారు. అయోధ్య రామాలయ నిర్మాణంలోనూ ఇదే టెక్నాలజీ వాడితే ఈ ఆలయం కూడా కలకాలం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయం ట్రస్ట్‌కు ప్రతిపాదనలు పంపడానికి సర్వం సిద్ధం చేశారు.


Next Story