డ్రగ్ కేసులో ప్రముఖ హీరో అండ్ వైఫ్

దిశ, వెబ్‌డెస్క్: శాండల్‌వుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో బడా వ్యక్తుల పేర్లు బయటకొస్తున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు కర్ణాటక పొలిటికల్ లీడర్స్ వారసులు, బడా ఇండస్ట్రియలిస్టుల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్లు సంజనా గల్రాని, రాగిణి ద్వివేది, ప్రశాంత్ రాంకా, డ్రగ్ పెడ్లర్ రాహుల్ సహా పలువురు అరెస్ట్ కాగా.. కొత్తగా హీరో దిగంత్‌తో పాటు తన భార్య ఐంద్రితా రాయ్ కూడా డ్రగ్ మాఫియా లిస్ట్‌లో చేరినట్లు కనిపిస్తోంది. వాన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దిగంత్‌తో పాటు తన వైఫ్‌కు కూడా సీసీబీ నోటీసులు జారీ చేయగా విచారణకు హాజరయ్యారు. వీరితో పాటుగా కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా తనయుడు ఆదిత్య అల్వాకు కూడా సీసీబీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సంజన, రాగిణిలు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండగా.. డ్రగ్ పెడ్లర్ రాహుల్ లాక్‌డౌన్ టైమ్‌లోనూ ఫాంహౌస్‌లో డ్రగ్ పార్టీలు నిర్వహిస్తుండేవారని సీసీబీకి తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో ఎలాంటి ప్రముఖ వ్యక్తులున్నా సరే వదిలేది లేదని హోం మంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisement