- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్‌కు షాక్.. డ్రగ్స్ కేసు విచారణ వాయిదా
దిశ, వెబ్‌డెస్క్ : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేదికి మరోసారి నిరాశ ఎదురైంది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించినా లాభం లేకుండా పోయింది. స్పెషల్ కోర్టులు, కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో చివరగా అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించింది రాగిణి. అయితే రాగిణి నిందితురాలే అని, తనకు డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు ఉన్నాయని.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నాయని బెంగుళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు సుప్రీంలో కౌంటర్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన వాదనలు పూర్తి కాగా విచారణ వాయిదా పడింది.
కాగా డ్రగ్స్ మాఫియా కేసులో రాగిణిని 4 సెప్టెంబర్, 2019న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు.. గంజాయితో నింపిన సిగరెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. కాగా ఈ కేసులో అరెస్టయిన హీరోయిన్ సంజనా గర్లానీకి అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు కావడంతో బయటపడింది.