- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎరువుల కోసం కాదు… కరోనా పరీక్షల కోసం

X
దిశ, ఆందోల్: ఒకప్పుడు ఎరువుల కోసం ఇలాంటి క్యూ చూసాం. కానీ కరోనా పరీక్షల కోసం కూడా ప్రజలు ఇలాంటి క్యూనే ఫాలో అయ్యారు. జోగిపేటలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు మంగళవారం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్లు టోకెన్ల కోసం చెప్పులను క్యూలో ఉంచారు.
ఇలా ఎవరి చెప్పులను బట్టి వారు, వారి టోకెన్లను తీసుకుని పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం ఆసుపత్రిలో 40 మందికి టెస్టులు చేయగా, అందులో 10 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. అంతేగాకుండా తాలేల్మా ఆరోగ్య కేంద్రంలో 74 మందికి చేయగా, 12 మందికి పాజిటివ్ వచ్చింది.
Next Story