- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలవరంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
by srinivas |

X
పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. భారీ ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తూ, ప్రశ్నించిన వారిపై ఇసుక మాఫియా తిరగబడుతోంది. పగటి వేళల్లో అధికారులు ఉండడంతో స్దబ్దుగా ఉంటే ఇసుక మాఫియా చీకటి పడిందంటే చాలు జూలు విదులుస్తోంది. జేసీబీ యంత్రాలతో ఇసుకను పెద్దపెద్ద టిప్పర్ లారీలతో అక్రమ రవాణా చేస్తోంది. పోలవరం, గూటాల, పట్టిసీమల్లోని ఇసుక ర్యాంపుల నుంచి వందలాది లారీలతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియాలో కొంతమంది ప్రభుత్వాధికారులతో బేరసారాలు మాట్లాడుకుని ధైర్యంగా ఇసుకును యధేచ్చగా తరలించుకునిపోతున్నారు. వారి ఆగడాలు శృతిమించడంతో నిఘా వేసిన నిరంజన్ రెడ్డి 4 లారీలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story