శాంసంగ్ కొత్త ఫోన్.. ధర రూ.6 లోపే

by  |
శాంసంగ్ కొత్త ఫోన్.. ధర రూ.6 లోపే
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ మానవ జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. వైరస్ కట్టడికి ఎక్కడికక్కడ ఉన్నపలంగా బంద్ పెట్టి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ మూలంగా అనేక కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. కాగా ఈ విపత్కర సమయంలో ప్రజలను ఉపాధి కూడా కరువైంది. దీంతో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి గమనించిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ తక్కువ ధరలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ వాడాలనుకునే వారి కోసం గెలాక్సీ ఎం01 కోర్‌ పేరిట కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ గోతో పనిచేసే ఈ ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్లు, మూడు కలర్‌ వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకురానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం01 కోర్‌ 1జీబీ/ 16జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.5,499గా నిర్ణయించింది. 2జీబీ/ 32జీబీ వేరియంట్‌ దర రూ.6,499గా పేర్కొంది. నలుపు, నీలం, ఎరుపు రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది. అన్ని శాంసంగ్‌ రిటైల్‌ స్టోర్లలోనూ, ప్రముఖ ఆన్‌లైన్‌ పోర్టళ్లలోనూ ఈ నెల 29 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో డ్యూయల్‌ సిమ్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ గోతో వన్‌ యూఐపై పనిచేసే ఈ ఫోన్‌లో 5.3 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్‌ 6739 ప్రాసెసర్‌ అమర్చారు. వెనుక వైపు 8ఎంపీ కెమెరా, ముందు వైపు సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 3.5 ఎంఎం హెచ్‌ఫోన్‌ జాక్‌ సదుపాయం కూడా ఉంది.



Next Story