- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్
దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదలైన ఈ ఫోన్ భారీ బ్యాటరీ(6000 ఎంఏహెచ్)తో రానుంది. అమెజాన్ ఇండియా, శాంసంగ్ డాట్‌కామ్‌ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ ఫోన్ ఆగస్టు 6న మార్కెట్లో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. సింగిల్ టేక్ కెమెరా మోడ్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి యూజర్లు ఫొటోలు, వీడియోలు తీసేందుకు వీలవుతుంది ‘సింగిల్ టేక్’ అనే ఆప్షన్ ఎంచుకుని వీడియో రికార్డు చేయడం మొదలుపెడితే.. కెమెరా ఫుటేజ్‌ను కవర్ చేస్తుంది. మొత్తంగా ఎట్ ఏ టైమ్ 7 ఫోటోలను, మూడు వీడియోలను క్యాప్చర్ చేయడం దీని ప్రత్యేకత.
ఫీచర్స్ :
డిస్ ప్లే. : 6.50 అంగుళాలు
ప్రాసెసర్ : శాంసంగ్ ఎక్సీనోస్ 9611
ర్యామ్ : 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128జీబీ
రేర్ కెమెరా : 64+12+5+5 మెగా పిక్సల్
ఫ్రంట్ కెమెరా : 32 మెగాపిక్సల్
ఓఎస్. : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 6000mAh
రంగులు. : మిరాజ్ బ్లూ, మిరాజ్ బ్లాక్
ధర : రూ. 19,499/-