గెలాక్సీ ఎమ్ సిరీస్‌ నుంచి బడ్జెట్ ఫోన్లు

by  |
గెలాక్సీ ఎమ్ సిరీస్‌ నుంచి బడ్జెట్ ఫోన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎమ్ సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ ఎమ్11, గెలాక్సీ ఎమ్ 01’ ఫోన్లను ఇండియాలో ఈరోజు (మంగళవారం) లాంచ్ చేసింది. గెలాక్సీ ఎమ్ 11 ఫోన్‌ను యూఏఈలో ఇదివరకే విడుదల చేయగా ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ. 10,999/- కాగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధరను రూ. 12,999/- గా నిర్ణయించింది. గెలాక్సీ ఎమ్01 ఫోన్ ఒకే వేరియంట్‌లో లభించనుంది. ఈ ఫోన్లు బ్లూ, బ్లాక్‌, వాయిలెట్, రెడ్‌ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. మెమొరీ కార్డుతో 512 జీబీ వరకు స్టోరేజీన సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. మంగళవారం మ.12 గంటల నుంచే ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ లభించనున్న ఈ రెండు మోడల్స్‌లో సామ్‌సంగ్‌ ‘హెల్త్‌ యాప్‌’ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తోంది.

గెలాక్సీ ఎమ్ 11 ఫీచర్లు :

డిస్‌ప్లే : 6.4 ఇంచ్‌
ర్యామ్ : 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 32జీబీ
ప్రాసెసర్‌ : ఆక్టాకోర్‌
రేర్ కెమెరా : 13 +2 +5 ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్‌

ధర : రూ.10,999/-

గెలాక్సీ ఎమ్ 11 రెండో వేరియంట్ :

ర్యామ్‌ : 4జీబీ
స్టోరేజ్‌ : 64 జీబీ

ధర : రూ.12,999/-

గెలాక్సీ ఎమ్ 01 :

డిస్‌ప్లే : 5.7 ఇంచులు
ప్రాసెసర్‌ : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 439
ర్యామ్ : 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 32జీబీ
కెమెరా : 13+2 +5 ఎంపీలు
ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
బ్యాటరీ : 4000 ఎంఏహెచ్

ధర : రూ. 8,999/-


Next Story

Most Viewed