పూర్తి ఏఐ-ఎనేబుల్ వాషింగ్ మెషీన్‌లపై శాంసంగ్ ఇండియా దృష్టి

by Harish |
పూర్తి ఏఐ-ఎనేబుల్ వాషింగ్ మెషీన్‌లపై శాంసంగ్ ఇండియా దృష్టి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ దేశీయ ఆవిష్కరణల సామర్థ్యంతో ఏఐ-ఎనేబుల్డ్ వాషింగ్ మెషీన్‌లను తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా ఈ ఏడాది భారత్‌లో పూర్తి ఆటోమెటిక్ విభాగంలో అగరస్థానంలో కొనసాగాలని కంపెనీ సీనియర్ ఆధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్స్ విభాగంలో 24.6 శాతం నుంచి 32 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఇటీవల శాంసంగ్ ఇండియా పూర్తి ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ల కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.

ఇవి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) హిందీ, ఇంగ్లిష్ భాషల ఇంటర్‌ఫేస్‌తో మార్కెట్లో విడుదలయ్యాయి. ‘2021 ఏడాది చివరి నాటికి పూరి ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్ల విభాగంలో 32 శాతం వాటాను సాధించాలనే లక్ష్యంతో ఉన్నాము. భిన్నమైన ఉత్పత్తులతో, భారతీయ వినియోగదారులకు అనువైన సౌకర్యాలతో వీటిని తీసుకురానున్నామనీ శాంసంగ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బిజినెస్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాజు పుల్లన్ చెప్పారు. ప్రస్తుతం ఈ విభాగంలో ఎల్‌జీ కంపెనీ కొనసాగుతోంది. శాంసంగ్ ఇండియా ఈ ఏడాదిలో కొత్తగా 21 మోడళ్లను విడుదల చేయనుందని, వాటిలో 16 మోడళ్లు ఏఐ-ఎనేబుల్డ్ ఉండనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story