- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్… నీ మాట నా హృదయాన్ని తాకిందంటున్న స్టార్ హీరో
X
దిశ, సినిమా: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఈ నెల 17న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా’తో అభిమానులను ఉర్రూతలూగించిన సమంత.. ఈ సినిమాలో బన్నీ నటనపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ నోట్ పోస్ట్ చేసిన సామ్.. ‘పుష్పలో బన్నీ ప్రతీ క్షణం అందరినీ కట్టిపడేసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక నటుడు అసాధారణ స్థాయిలో పర్ఫార్మ్ చేస్తే అలాంటి వారి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం. ఎంతో మందికి స్ఫూర్తి దాయకం’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘మీ హృదయపూర్వక అభినందనలకు ధన్యవాదాలు. మీ పొగడ్త నా గుండెను తాకింది’ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Advertisement
- Tags
- allu arjun
Next Story