నీ పనేంటో నువ్వు చూసుకో.. వైరల్ అవుతోన్నSamantha స్టేటస్

by Anukaran |   ( Updated:2021-11-13 07:04:32.0  )
Samantha instagram post
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య, సమంతల ( Samantha )విడాకుల వ్యవహారం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత నెటిజన్ల ఫోకస్ సమంత పర్సనల్ లైఫ్‌పై పడింది. ఆమె ఏ పని చేసినా.. ఎవరిని ఉద్దేశించి మెసేజ్ చేశారు అంటూ ఆలోచనలో పడిపోతున్నారు నెటిజన్లు. ఇప్పటికే పలు చానళ్లలో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆమె కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పెట్టిన ఓ స్టేటస్‌ కూడా అలాగే ఉంది. ‘నిత్యం పక్క వాళ్ల గురించి, వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన పని మీకు లేదు.. ముందు నీ పనేంటో నువ్వు చూసుకో.. నీ ‌లైఫ్‌కు ఏం కావాలో అది చూసుకో’ అంటూ స్టేటస్‌‌లో క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు ఎవరినీ ఉద్దేశించి.. ఈ క్యాప్షన్ ఇచ్చి ఉంటుంది అంటూ ఆలోచనలో పడ్డారు.

విమర్శలతో సంబంధంలేదంటున్న స్టార్ నటి.. నైట్ పార్టీలో డ్యాన్స్


Next Story