- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ 30లో సమంత?
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ 30వ సినిమా రాబోతోంది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న చిత్రాన్ని 2021 ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. ‘అరవింద సమేత’ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో చేయబోతున్న ఈ మూవీ పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. అందుకే సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్‌కు జోడిగా ముందుగా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న రష్మిక మందనాను అనుకున్నారట. కానీ, తన ప్లేస్‌లో సమంత వచ్చేసింది. ‘బృందావనం’, ‘రభస’, ‘రామయ్య వస్తావయ్య’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల తర్వాత మరోసారి తారక్‌కు జంటగా కనిపించబోతోంది శామ్.
ఎన్టీఆర్ పక్కన పూజాహెగ్డేను తీసుకుంటారని కూడా టాక్ వచ్చింది. త్రివిక్రమ్ హీరోయిన్ రిపీట్ చేస్తాడని.. అందుకే ‘అల వైకుంఠపురంలో’ హీరోయిన్ పూజానే ఎన్టీఆర్ 30 మూవీకి ఫిక్స్ చేస్తాడని భావించారు. కానీ, చివరికి ఈ సినిమా ఛాన్స్ సమంతకు వచ్చి చేరిందట.