సామ్ బిగ్ అనౌన్స్‌మెంట్

దిశ, వెబ్‌బెస్క్: అక్కినేని కోడలు సమంత ఏది చేసినా చాలా పర్‌ఫెక్ట్‌గా, స్పెషల్‌గా చేస్తుంది అంటుంటారు. అఫ్‌కోర్స్ మూవీస్ ఎంచుకోవడం నుంచి చైతును పెండ్లి చేసుకునే వరకు అన్నీ పర్‌ఫెక్ట్. ఆ తర్వాత గార్డెనింగ్… ఎకం స్కూల్ ద్వారా బిజినెస్‌లోకి అడుగుపెట్టడం నిజంగానే స్పెషల్. అయితే ఇప్పుడు మరో యూనిక్ కాన్సెప్ట్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాను అని ప్రకటించింది. తన సర్ ప్రైజ్ గురించి వినేందుకు శనివారం మధ్యాహ్నం 12గంటలకు అందరూ రెడీగా ఉండాలని సూచించింది.

చాలా ఏండ్లుగా ఇలాంటిది నిర్మించాలనే ఆలోచనలో ఉన్నానని..అద్భుతమైన టీం దొరకడంతో ఇన్నాళ్లకు సాధ్యమైందని చెప్పింది. నాకు మద్దతిచ్చిన, నిరంతరం ప్రేమను పంచిన మీ అందరినీ చేరేందుకు ఇది నా మార్గం అని తెలిపింది. కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో దీనిపై పనిచేశాం కాబట్టి.. మరింత ప్రత్యేకమని వివరించింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకునేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను అని తెలిపింది. కాగా, ఈ మధ్య ప్రతీ చిట్ చాట్ సెషన్‌లోనూ స్పెషల్ అనౌన్స్‌మెంట్ గురించి ప్రస్తావించింది సామ్. మీరు నిజంగా సర్‌ప్రైజ్ అవుతారని చెప్పింది. మరి ఆ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందో..? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Advertisement