వారికి దిమ్మ తిరిగే షాకిచ్చిన సమంత.. కోర్టులో పరువు నష్టం దావా

by Anukaran |   ( Updated:2021-10-20 06:26:04.0  )
Samantha
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన స్టార్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించింది. విడాకుల తర్వాత తనపై అసత్య ప్రచారం చేసి, పరువుకు భంగం కలిగించారంటూ మూడు యూ ట్యూబ్ చానల్స్‌పై కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. సమంత నిర్ణయంతో సదరు చానల్స్‌కు ఊహించని షాక్ తగిలినట్టు అయింది. అయితే, 2017లో ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగచైతన్య-సమంతలు ఈ ఏడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ పెరిగాయి. ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో బాలీవుడ్‌లో బోల్డ్‌గా నటించింది, సమంతకు ఎఫైర్స్ ఉన్నందుకే ఈ జంట విడిపోయింది అంటూ పలు చానల్స్‌లో సంచలన ఆరోపణలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తన పరువుకు నష్టం జరిగింది అంటూ సమంత కోర్టును ఆశ్రయించింది. అయితే, ఏఏ చానల్స్‌ అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story