కీర్తి సురేశ్, రష్మికకు సమంత ఛాలెంజ్

by Shyam |   ( Updated:2020-07-11 09:53:18.0  )
కీర్తి సురేశ్, రష్మికకు సమంత ఛాలెంజ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున శనివారం మొక్కలు నాటారు. అనంతరం ఆయన కోడలు, నటీ సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. అనంతరం సమంత మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఒక వెపన్ లా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. తన అభిమానులందరూ ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇక తన కోస్టార్స్ మహానటి కీర్తి సురేష్, టాలీవుడ్ బ్యూటీ రష్మీక మందాన్నకు ఛాలెంజ్ విసిరారు.

Advertisement

Next Story