బిగ్‌బాస్ హోస్ట్‌గా అక్కినేని కోడలు?

by Jakkula Samataha |
బిగ్‌బాస్ హోస్ట్‌గా అక్కినేని కోడలు?
X

బిగ్‌బాస్ షో నాలుగో సీజన్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ షికారు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రసారమైన మూడు సీజన్లు టీఆర్పీ రేటింగ్‌తో అదరగొట్టగా.. స్టార్ హీరోల హోస్టింగ్‌కు చాలా ఆదరణ లభించింది. ఫస్ట్ సీజన్‌లో తారక్, సెకండ్ సీజన్‌కు నాని, మూడో సీజన్‌లో నాగార్జున హోస్టింగ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. త్వరలో నాలుగో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. వీరిలో ఎవరో ఒకరు హోస్ట్‌గా రిపీట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే అక్కినేని వారి కోడలును హోస్ట్‌గా తీసుకొస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారట నిర్వాహకులు.

తన ఎంట్రీ.. ‘బిగ్‌బాస్ షో’కు గ్లామర్ టచ్ ఇవ్వడంతో పాటు తన క్యూట్ లుక్స్‌తో షో‌కు మరింత ఆదరణ లభిస్తుందని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ విషయంపై సమంతను సంప్రదించారని తెలుస్తోంది. కానీ తను మాత్రం ఎక్కువ ఆసక్తి చూపడంలేదని సమాచారం. కాగా ఇప్పటికే కొందరు కంటెస్టెంట్‌ల పేర్లు బయటకు రాగా.. హోస్ట్ ఎవరనేదే సస్పెన్స్‌గా మారింది.



Next Story

Most Viewed