నటన నేర్చుకుంటున్న సమంత

by  |
నటన నేర్చుకుంటున్న సమంత
X

దిశ, వెబ్ డెస్క్: వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికే ఓ మంచి నటిగా అక్కినేని సమంత ప్రూవ్ చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ.. నటనకు అవకాశముండే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఓ వైపు వైవాహిక జీవితాన్ని, మరోవైపు సినీ జీవితాన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. లాక్డౌన్ టైమ్ లో సమంత ఏం చేస్తోంది?ఇది చాలా మంది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇటీవలే తన పుట్టినరోజును చై తో సంతోషంగా జరుపుకున్న సమంతా లాక్డౌన్ టైమ్ ను అందరిలా వృథా చేయకుండా.. చాలా తెలివిగా ఉపయోగించుకుంటుంది. ఇంతకీ సమంత ఏం చేస్తుందంటే.. నటన నేర్చుకుంటోంది? ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అదే నిజం. సమంత ప్రస్తుతం ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసులో జాయిన్ అయింది. నటనలో మెళకువలు నేర్చుకుంటున్న విషయాన్నే స్వయంగా సామ్ తన ఇన్ స్టా గ్రాం అకౌంట్ ద్వారా అభిమానులకు వెల్లడించింది. '1000 గంటల్లో ఒక్క గంటనైనా చక్కగా ఉపయోగించుకున్నప్పుడు అది అందరికీ చెప్పాల్సిందే. ఈ లాక్‌ డౌన్‌ పూర్తయ్యే సరికి నేనింకా బెటర్‌ యాక్టర్‌ని అవుతానని అనుకుంటున్నాను. ఒకవేళ కాలేదనుకోండి.. అప్పుడు ఈ పోస్ట్‌ని డిలిట్‌ చేస్తాన'ని సమంత పేర్కొంది. పదేళ్ల క్రితం టాలీవుడ్ లో అడుగుపెట్టిన సామ్.. ఎన్నో విజయాలతో, ఎన్నో మంచి పాత్రలతో అభిమానుల మనసు గెలుచుకుంది. ఇప్పటికీ కూడా నటనలో మరింత పరిణితి సాధించేందుకు కష్టపడుతూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. అన్నట్లు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా లాక్డౌన్ పీరియడ్ లో డైరెక్షన్ కు సంబంధించిన ఆన్ లైన్ క్లాసులో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.

tags: samantha, tollywood heroine,sam takes online acting lessons


Next Story

Most Viewed