- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైనల్లీ.. మ్యారేజ్ ప్లాన్స్ రివీల్ చేసిన సల్లూ భాయ్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం ఫ్యాన్స్ కొన్నేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. కెరీర్‌లో చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపిన కండల వీరుడు.. అవేవీ పెళ్లి దాకా వెళ్లకపోవడంతో ఇంకా బ్యాచిలర్‌గానే కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటికే ఐదు పదులు క్రాస్ చేసిన సల్మాన్ లైఫ్‌లో ఇక మ్యారేజ్‌కు స్థానం లేదనే రూమర్స్ వినిపిస్తుండగా.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 15 ప్రీమియర్ ఎపిసోడ్‌లో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు సల్మాన్. ‘నా పెళ్లికి ఇంకాస్త టైమ్ ఉందని చెప్పను కానీ, ఆ కాస్త టైమ్ గడిచిపోయింది’ అని కంటెస్టెంట్ అఫ్సానా ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఇదే క్రమంలో సల్మాన్‌ను ‘భాయ్’ అని పిలవచ్చా అని అడిగితే ఒకే చెప్పిన భాయ్‌జాన్.. ‘నేను భారత్ మొత్తానికి సోదరుడిగా మారినట్లు అనిపిస్తోంది’ అన్నాడు.
ఇక ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సల్మాన్ ఫాదర్ సలీమ్ ఖాన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైతే.. సల్మాన్ పెళ్లి గురించిన ప్రశ్నకు అల్లాహ్ కూడా ఆన్సర్ చేయలేడని చమత్కరించాడు. అయితే గతంలో కోస్టార్ సంగీత బిజిలానీతో సల్మాన్‌కు పెళ్లి కుదిరి, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయి. కానీ, సల్మాన్ మరో మహిళతో సంగీతకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో వివాహం ఆగిపోయింది.
- Tags
- marriage plans