హోటళ్లలో ఉన్న ఎమ్మెల్యేల జీతాలు వెనక్కి తీసుకోవాలి

by  |
హోటళ్లలో ఉన్న ఎమ్మెల్యేల జీతాలు వెనక్కి తీసుకోవాలి
X

జైపూర్: రాజస్తాన్‌లో ప్రజలకు సేవలందించకుండా హోటళ్లలో ఉన్న ఎమ్మెల్యే జీతాలు, ఇతర బెనిఫిట్లు, అలవెన్సులను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఇరువురు నేతలు తమ మద్దతు ఎమ్మెల్యేలను పలుహోటళ్లకు తరలించిన సంగతి తెలిసిందే.

దాదాపు మూడు వారాలుగా హోటళ్లో ఉంటున్న ఈ ఎమ్మెల్యేల వేతనాలు, అలవెన్సులు, ఇతర సదుపాయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వివేక్ సింగ్ అనే వ్యక్తి రాజస్తాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రజలకు సేవ చేయడానికే ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నారని, కానీ, నియోజకవర్గాల్లోని ప్రజలకు దూరంగా, వారి బాధ్యతలు నిర్వర్తించకుండా కొందరు ఎమ్మెల్యేలు హోటళ్లలో ఉంటున్నారని పిటిషన్ పేర్కొంది. వారిపక్షంలో మరెవరూ ప్రజలకు అందుబాటులో లేరని, కాబట్టి వారి వేతనాలు, సదుపాయాలు, అలవెన్సులు ఉపసంహరించాలని కోరింది. రాజస్తాన్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు దాఖలైన ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.


Next Story

Most Viewed