సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆర్టీసీలో కొత్త రూల్స్

by Shyam |
TS RTC MD Sajjanar
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయ్యింది. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా యూజ్ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీలో కొత్తరూల్స్ జారీ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని, కండెక్టర్‌తో పాటు డ్రైవర్ కూడా విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు. అంతే కాకుండా బ‌స్సులో శానిటైజ‌ర్ అందుబాటులో ఉంచాల‌ని, క‌రోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ‌స్టాండ్‌లో మైకుల ద్వారా ప్రక‌టిస్తుండాల‌ని స‌జ్జనార్ సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తం‌గా అన్ని బ‌స్సుల‌ను, బ‌స్ స్టాప్ ల‌ను ఎప్పటిక‌ప్పుడు శానిటైజ్ చేయాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ కరోనా కట్టడికి ప్రత్యేకం‌గా చ‌ర్యలు తీసుకోవాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ స‌జ్జనార్ అధికారుల‌ను ఆదేశించాడు.

Advertisement

Next Story