సజ్జనార్ కీలక నిర్ణయం.. వారికి బస్సులో ఫ్రీ జర్నీ

by Shyam |   ( Updated:2021-11-14 01:27:37.0  )
Sajjanar-125
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీసీలో ఎన్నో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిల్లల దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 ఏళ్ల పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని సజ్జనార్ ట్విట్టర్లో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తీసుకున్నారు.

Advertisement

Next Story