- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ఇలా మారిపోయారేంటి.. సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనే అనుమానం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి హక్కుగా వచ్చిన నీటి వాటాను మాత్రమే పూర్తిగా వినియోగించుకోవాలనుకుంటున్నామని వెల్లడించారు. మన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉండాలన్నదే సీఎం జగన్ అభిమతమన్నారు. జల వివాదం పరిష్కారం కావాలి.. సానుకూల నిర్ణయం రావాలనే ప్రధాని మోడీ, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు లేఖలు రాసినట్లు తెలిపారు. 881 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డి పాడు నుంచి 40 వేల క్యూసెక్కులు నీటిని తీసుకునే పరిస్ధితి లేదన్నారు. ప్రస్తుతం వరద తక్కువగా ఉందని 15 రోజులు కూడా రిజర్వాయర్లలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటం లేదని తెలిపారు. గతంలో అతితక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని సజ్జల తెలిపారు.
కేసీఆర్! ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు
రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా తానే ముందుండి అన్యాయం జరగకుండా చూస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినట్లు సజ్జల గుర్తు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడమే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు లక్ష్యమన్నారు. సీఎం జగన్ ప్రస్తుతం చేస్తోన్న ప్రయత్నాన్ని గతంలో కేసీఆర్ అంగీకరించారన్నారు. ఉభయరాష్ట్రాల సీఎంల మధ్య గతంలో జరిగిన సమావేశంలో తాను ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో అంగీకరించారని కేసీఆర్ ఒపెన్ మైండ్‌తో మాట్లాడారని చెప్పుకొచ్చారు. పరిపాలన కోసం తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటికీ ఒకటేనన్నారు.
రాయల సీమ కష్టాలు తనకు తెలుసని కేసీఆర్ అన్నారని సజ్జల గుర్తు చేశారు. పరస్పరం ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలని చెప్పిన కేసీఆర్ ఈ రోజున ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. 800 అడుగుల లోపే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మాటల దాడి మెుదలు పెట్టారని విమర్శించారు. ఏడాదికి 600 టీఎంసీలు కూడా ఏపీకి రావడం లేదన్నారు. పరుషంగా… అనవసరంగా మాట్లాడటం సరికాదని సీఎం జగన్ అన్నారని స్పష్టం చేశారు. రాజకీయంగా మంత్రులు మాట్లాడతారని లేకపోతే కేంద్రమే న్యాయం చేయాలని అడుగుతామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కంట్రోల్ తప్పే పరిస్థితి ఉండదని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జల వివాదంపై సంయమనం పాటించాలని లేని పక్షంలో ఆ రాష్ట్రమే నష్టపోతుందన్న విషయాన్ని గుర్తించాలని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.