అద్దంలో చంద్రబాబు చంద్రబాబునే తిట్టుకున్నట్లుంది

by srinivas |   ( Updated:2021-01-21 03:49:54.0  )
అద్దంలో చంద్రబాబు చంద్రబాబునే తిట్టుకున్నట్లుంది
X

దిశ,వెబ్‌డెస్క్:సీఎం జగన్‌ను టార్గెట్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని సజ్జలరామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఆవేశంగా, దబాయింపు ధోరణిలో ఎందుకు మాట్లాడుతున్నారో తనకర్ధం కావడం లేదన్నారు. దేవుడి విగ్రహం గురించి, డీజీపీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇవాళ చంద్రబాబు మాట్లాడిన మాట తీరు.., ప్రెస్ మీట్ ముందే ఆయన అద్దం ముందు నిలబడి చంద్రబాబు చంద్రబాబునే తిట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏపీ ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల కమిషనర్ హైదరాబాద్ వదిలి రారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇంట్లోనుంచి కదలరు. ఏదైనా మాట్లాడాలంటే జూమ్ మీటింగ్ అంటారు. మీరు మాత్రం బాగుండాలి. ప్రజలు ఇబ్బందిపడాలా అని సజ్జల చంద్రబాబును ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed