ఆయన రూటే వేరు..సజ్జల

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన చంద్రబాబు ఈ సాయంత్రం టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించారు. దీనిపై సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఎంతైనా చంద్రబాబు రూటే వేరన్నారు. చాలా నెలల తర్వాత హైదరాబాద్ లో స్వీయ గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చారన్నారు. కార్మికుల సొమ్ము మింగి బెయిల్ పై బయట తిరుగుతున్న అచ్చెన్నాయుడిని, హత్య కేసులో అరెస్టైన రవీంద్రలను పరామర్శించేందుకు వెళ్తున్నారని అన్నారు. కానీ విశాఖ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు మాత్రం వెళ్ల లేదన్నారు.

Advertisement