భారీ వేతనంతో సాయ్ కన్సల్టెంట్ నియామకం

by Shyam |   ( Updated:2020-07-07 10:01:05.0  )
భారీ వేతనంతో సాయ్ కన్సల్టెంట్ నియామకం
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రీడలను మరో స్థాయికి తీసుకెళ్లగలిగి, 2024, 2028 ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించేలా క్రీడాకారులను సంసిద్ధం చేయగలిగే కన్సల్టెంట్‌ను నియమించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్ణయం తీసుకుంది. రూ. కోటి నుంచి రూ. 1.5 కోట్ల మధ్య జీతంతో ఒక విదేశీ కన్సల్టెంట్ నియామకానికి శాయ్ సిద్ధపడినట్లు ‘ది ట్రిబ్యూన్’ పత్రిక తెలిపింది. ఒకవేళ అంత జీతంతో కన్సల్టెంట్‌ను నియమిస్తే, సాయ్ చరిత్రలోనే అత్యధిక వేతనం తీసుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ పోస్టుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సాయ్ ఆధ్వర్యంలోని ప్యానెల్ ఇంటర్య్వూ చేసి తుది నిర్ణయం తీసుకుంటుంది. కన్సల్టెంట్ నియామకంతోపాటు నలుగురు సీనియర్ రీసెర్చ్, ఐదుగురు రీసెర్చ్, ఐదుగురు అథ్లెట్ రిలేషన్‌షిప్ అధికారులను కూడా నియమించనున్నట్లు తెలుస్తున్నది. వీరికి వరుసగా రూ.లక్ష, రూ. 60 వేలు, రూ. 45 వేలు జీతంగా ఇవ్వనున్నారు. ఇప్పటికే భారతీయ కోచ్‌ల జీతం రూ.2 లక్షల లోపు ఉండాలనే నిబంధనను ఇటీవల ఎత్తేసింది. నాణ్యమైన, నిబద్దత కలిగిన కోచ్‌లు, అధికారులను నియమించడం ద్వారా రాబోయే రోజుల్లో క్రీడాకారులను మరింత పోటీ ఇచ్చేలా తయారు చేయవచ్చని సాయ్ భావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed