‘నభా’ను సర్‌ప్రైజ్ చేసిన తేజ్..

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు పాటలు కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. లాక్‌డౌన్ లేకుంటే ఈ పాటికి ఎప్పుడో విడుదలయ్యేది. ఇటీవలే షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో.. ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ షురూ అయింది. అయితే, ఆదివారంతో హీరోయిన్ నభా షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే సాయి తేజ్.. నభాకు గుర్తిండిపోయేలా ఓ మధురమైన బహుమతిని అందించాడు. ‘నభా ఫొటో ఫ్రేమ్’ను కానుకగా ఇవ్వడంతో పాటు నభాకు నచ్చే కొన్ని గిప్ట్స్‌ను అందించాడు. ఈ సర్‌ప్రైజింగ్ గిప్ట్‌కు నభా తెగ మురిసిపోయింది. ‘సోలో బతుకే సో బెటర్ నా షూటింగ్ పార్ట్ ఈ రోజుతో పూర్తవుతుంది. అయితే.. విరాట్ అలియాస్ జెట్ పాండా (సాయి తేజ్ ఇన్‌‌స్టా నేమ్) నాకు అద్భుతమైన గిప్ట్ ఇచ్చాడు. థ్యాంక్యూ టీవోజే’ అని నభా పేర్కొంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇంతవరకు ఈ చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, మరికొన్ని రోజుల్లో థియేటర్లు తెరిచే అవకాశం ఉండటంతో.. ఈ చిత్ర యూనిట్ అప్పటివరకు వెయిట్ చేసి, సిల్వర్ స్క్రీన్‌పై సినిమా విడుదల చేస్తుందా? లేదా ఓటీటీకే మొగ్గు చూపుతుందా? మరికొన్ని రోజుల్లో తేలనుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Advertisement