అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సాయిపల్లవి

by Anukaran |   ( Updated:2020-10-09 08:30:48.0  )
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సాయిపల్లవి
X

దిశ, వెబ్ డెస్క్: మలార్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతోందట. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో లేడీ ఓరియంటెడ్ మూవీ కమిట్ అయినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే అనిల్ సాయి పల్లవికి కథ కూడా వినిపించగా..గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజు నిర్మాతగా నవంబర్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా, ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో బిజీగా ఉన్న సాయి పల్లవి.. రానాతో విరాటపర్వం సినిమా కూడా చేస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోగా..ఈ సినిమా కూడా అమేజింగ్ స్క్రిప్ట్‌తో ఎంటర్టైన్ చేయనుందట.

Advertisement

Next Story

Most Viewed