మానవజాతిపై ఆశ క్షీణిస్తోంది : సాయి పల్లవి

by  |
మానవజాతిపై ఆశ క్షీణిస్తోంది : సాయి పల్లవి
X

తమిళనాడులో ఏడేళ్ల బాలిక జనప్రియపై జరిగిన అత్యాచారం, హత్యపై స్పందించారు హీరోయిన్ సాయి పల్లవి. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటన.. మానవ జాతికే మచ్చ అని మండిపడ్డారు. ఈ ఘటనతో మానవజాతిపై ఆశ క్షీణిస్తోందన్నారు. ఇతరులకు సహాయపడేందుకు ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేస్తున్నామని.. బలహీనంగా ఉన్న ప్రజలను బాధ పెడుతున్నామన్నారు. భయంకరమైన ఆనందాలను పొందేందుకు, సంతృప్తి పరిచేందుకు పిల్లలను చంపుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

రోజులు గడిచేకొద్దీ ప్రకృతి మనల్ని హెచ్చరిస్తోందన్న సాయి పల్లవి.. మానవజాతి పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో, ఈ అమానవీయ ప్రపంచంలో మరో ఆడ బిడ్డ పుట్టే అర్హత లేదన్నారు.

నేరం వెలుగులోకి వచ్చినప్పుడు లేదా సోషల్ మీడియాలో “ట్రెండ్” అయిన కేసుల్లో మాత్రమే న్యాయం జరగాలని కోరుకోవడం లేదన్న సాయి పల్లవి.. అసలు గుర్తించబడని నేరాల సంగతి ఏంటని? ప్రశ్నించింది. ఒక నేరాన్ని గుర్తించేందుకు సోషల్ మీడియాలో హాష్ టాగ్‌లు ట్రెండ్ చేయాల్సిన దుస్థితి నెలకొందని బాధపడింది.


Next Story

Most Viewed