సాయి పల్లవికి పరీక్ష తిప్పలు

దిశ వెబ్ డెస్క్: నటి సాయి పల్లవి జార్జియాలో మెడిసిన్ చదివిన విషయం అందరికి తెలిసిందే. అయితే విదేశాల్లో చదివిన వారు మన దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సిందే. దీంతో సాయి పల్లవి కూడా పరీక్షకు సన్నద్దమైంది. ఇందుకోసం లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంది. కాగా ఈ పరీక్ష రాసేందుకు సాయి పల్లవి తిరుచ్చికి చేరుకుంది. అయితే పరీక్ష కేంద్రంలో సాయి పల్లవిని చూసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు అందరు ఎగపడ్డారు. మాస్క్ లో వచ్చినా అందరు తనను గుర్తు పట్టడంతో ఇక చేసేదేమి లేక అందరితో కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

Advertisement