సాయి పల్లవి, అంజలి వెబ్ సిరీస్..

by Jakkula Samataha |
సాయి పల్లవి, అంజలి వెబ్ సిరీస్..
X

వెబ్ సిరీస్‌ల హవా రోజురోజుకూ పెరుగుతోంది. కంటెంట్ ప్రధానంగా సాగే సిరీస్‌లపై స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమంత, త్రిష, శృతి హాసన్, నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్ లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్‌ల్లో నటించగా.. తాజాగా పలువురు స్టార్స్‌తో కూడిన తమిళ్ వెబ్ సిరీస్.. ఒకటి సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఎంటర్‌టైన్ చేయబోతోంది.

పరువు హత్యలే ప్రధానాంశంగా సాగే ఈ వెబ్ సిరీస్.. నాలుగు కథల సంకలనం కాగా, ఒక్కో కథను ఒక్కో డైరెక్టర్ తెరకెక్కించారట. సుధా కొంగర, వెట్రి మారన్, గౌతమ్ మీనన్, విఘ్నేష్ శివన్‌ల దర్శకత్వంలో వచ్చిన ఒక్కో కథ ఒక్కో ఎపిసోడ్‌లో ఉండగా.. ప్రతీ ఎపిసోడ్ అర్ధ గంట నిడివి కలిగి ఉంటుందట.

సుధా కొంగర డైరెక్షన్‌లో కాళిదాస్ జయరాం, జీవీ ప్రకాష్ సోదరి భవానిశ్రీ నటించగా.. వెట్రిమారిన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, సాయి పల్లవి తండ్రీ కూతుళ్లుగా నటించారని సమాచారం. ఇక విఘ్నేష్ శివన్ కథలో అంజలి, కల్కీ కొచ్చిన్ నటించగా.. గౌతమ్ మీనన్ కాస్ట్ గురించి డిటెయిల్స్ తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story